Pawan Kalyan And Jagan Meet : జగన్,పవన్ మోడీ చెప్పినట్లుగా ఆడుతున్నారు | Oneindia Telugu

2018-11-09 36

AP SC and ST commission chairman Karem Shivaji made sensational comments over Opposition leader Jagan, Janasena chief Pawan Kalyan. He revealed that Jagan and Pawan met in Vatti Ravi's house in Visakhapatnam.
#PawanKalyan,
#Jagan
#KaremShivaji
#AndhraPradeshelections

ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి ఎపి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే విశాఖపట్టణంలోని వట్టి రవి ఇంట్లో జగన్, పవన్ కలిసారని కారెం శివాజీ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వట్టి రవి ఇంట్లో కలిసిన జగన్, పవన్ మధ్య పొత్తు, గురించి సీట్ల సంఖ్య గురించి కీలక చర్చలు జరిగాయన్నారు. అయితే ఈ చర్చల్లో సీట్ల సర్ధుబాటు కాకపోవడంతో వీరి మధ్య పొత్తు ఖరారు కాలేదని కారెం శివాజీ చెప్పుకొచ్చారు. "వైసిపి అధినేత జగన్ విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న సమయంలో వట్టి రవి నివాసంలో పవన్‌ను జగన్ కలిసి 40 సీట్లు ఆఫర్‌ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అప్పటికే సీఎం సీటుపై దృష్టి పెట్టి ఉండటంతో ఆ సీట్లకు ఆయన ఒప్పుకోలేదు. అలా ఆ చర్చల్లో సీట్లు సర్దుబాటు కాక వీరి పొత్తు పొడవలేదు."...అని కారెం శివాజీ వెల్లడించారు.

Videos similaires